Janasena News

పవన్ పిలుపు తో రంగంలోకి దిగిన పిఠాపురం ని యోజకవర్గ జనసేన కార్యకర్తలు, జేసీ వాసు


ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం లో జనసేన పార్టీ ని బలోపేతo చేయటకు సమావేశం నిర్వహించారు
ఈ సమావేశo లో నియోజకవర్గ జనసేన కార్యకర్త జగదీష్ చంద్ర వాసు గారు అలాగే యువత పాల్గొన్నారు ..
యువ కార్యకర్తలు అందరు తమ
ప్రసంగాలతో గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చి జనసేన పార్టీ ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలో తెలియజేశారు

తూర్పుగోదావరి జిల్లా: రాష్ట్ర యువత చేస్తున్నా "స్పెషల్ స్టేటస్ " ఉద్యమాన్నికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలియజేయడం తో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలు హోదా యొక్క ఉపయోగాన్ని విద్యార్ధులకు తెలియచేసారు ..
వైజాగ్ లో యువత చేస్తున్నా ఉద్యమాన్నికి మద్దతు గా పిఠాపురం నియోజకవర్గం లో
పిఠాపురం పట్టణంలో " ఉప్పాడ సెంటర్" వద్ద ఉదయం 10 గంటలకు హోదా కు మద్దతు గా నిరసన కార్యక్రమం చేయనున్నారు ..
ఈ కార్యక్రమ లో ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొనవలసిoది జనసేన కార్యకర్త జగదీష్ చంద్ర వాసు గారు పిలుపునిచ్చారు .
హోదా యొక్క ఉపయోగాన్ని విద్యార్ధులకు ఈవిధంగా తెలియచేసారు ..

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

ఎందుకు అంటారా

1947 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ చుడండి

ఒక్క సారి గుర్తు చేసుకోండి

పొట్టి శ్రీ రాములు వారి ప్రాణ త్యాగం తో తెలుగోడి కి అణిచివేత నుంచి విముక్తి లభించింది కానీ కొన్ని సంవత్సరాలు మాత్రమే

తర్వాత నిజములు దోచుకోగా మిగిలిన కొండ ల్ని తెలంగాన లో ని తొమ్మిది జిల్లాలని కలిపి ఆంధ్ర రాష్ట్ర ని నిర్మించారు

ఏమైంది మన శ్రమ ని మన పెట్టుబడులను 60 సంవత్సరాలు ఖజానా నింపుకుని అభివృద్ధి అయ్యాక లాక్కుని విభజించారు

ఏం చేసాము మనము సమైక్య ఆంధ్ర కావాలని రోడ్ ఎక్కము

అయినా విభజన తప్పలేదు

మరి మన యువత నిరుద్యోగత్వం ఏం అవ్వాలి దీనికి పరిష్కారం ఏమిటి

విద్యాశాతం ఎక్కువ ఉన్న జిల్లాలు మనవి వ్యవసాయం తో పాటు విద్యార్థులను శ్రామికు లని ఎక్కువ గా తాయారు చేయగలగా జిల్లాలు మనవి

మన యువత భవిష్యత్తు ఏమిటి

స్వలాభం కోసం రాష్టాన్ని ఆనాడు ఈనాడు ఏనాడూ తాకట్టు పెట్టె ప్రభుత్వాలు మధ్యన చోద్యం చూస్తూ ఉండిపోవటమే నా

ఎవ్వరూ ముందు కు రారు పోరాటం చేయరు అనుకుంటూ తిట్టుకుంటూ బ్రతికేయటమే నా

తమిలీయులు సంస్కృతి అంటూ జల్లికట్టు కి చేసిన ఉద్యమం లో పది శాతం మనం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చేయలేమా
రండి కదలి రండి కలిసి ప్రశ్నిద్దము శాంతియుతం గా పోరాటం చేద్దాము..Learn more »

టీ.డీ.పీ వాళ్ళు ప్యాకేజ్ అద్భుతం..అమోగం..అనంతం అని ఎందుకంటున్నారో తెలుసా ఇందుకే..

విజయవాడ : 
అప్పట్లో మన ముఖ్య మంత్రి గారు మన ఎం.పీ.లు స్పెషల్ స్టాటస్ అద్భుతం అన్నారు. సడన్ గా ఏం జ్ణానోదయం అయ్యిందో ఏమో కాని ప్యాకేజ్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. స్పెషల్ స్టేటస్ గురించి అడిగితే బీ.జే.పీ వాళ్ళకి కోపం రావాలి కాని టీ.డీ.పీ వాళ్ళకి వస్తోందేంటో అర్ధం కావట్లా.. ఒకవేళ బీ.జే.పీ వాళ్ళు స్పెషల్ స్టాటస్ ఇస్తానన్న టీ.డీ.పీ వాళ్ళు ఒప్పుకునేట్లు లేరు.. స్పెషల్ స్టేటస్ తీసుకు వస్తానని చెప్పిన టీ.డీ.పీ ప్రభుత్వం తీసుకు రాలేకపొయింది. ప్రభుత్వం మీద నమ్మకం పోయిన ప్రజలు పోరాడుతుంటే ప్రజలపై ఎదురుదాడి చేస్తోంది.. ప్రజలు పోరాడితే స్పెషల్ స్టేటస్ వస్తే వస్తది లేకపోతే లేదు దీని వల టీ.డీ.పీ కి వచ్చిన నష్టం ఏంటో అర్ధం కావట్లా.. ఇలాగే ప్రజలపై ఎదురుదాడి చేస్తుంటే ప్యాకేజ్ లో వాటాల కోసం ఎదురుదాడి చేస్తున్నారు అని ప్రజలు అనుకోవడం ఖాయం..   అధికారం పై ఆశలు వదిలేసుకునేట్లైతే ఇలాగే ప్రజల పై ఎదురుదాడి చెయ్యండి.. లేదా సైలెంట్ గా ఉండి ప్రజలకు సపోర్ట్ చెయ్యండి..


Learn more »

పవన్ కళ్యాణ్ ద్రుష్టికి మరొక సమస్య..వంశాధార నిర్వాసితుల సమస్యలు పవన్ ద్రుష్టికి రానున్నాయి..


శ్రీకాకుళం నగరం :
వంశాధార నిర్వాశితుల సమస్యలను జనసేన అధినేత శ్రీ.పవన్ కళ్యాణ్ ద్రుష్టికి తీసుకు వెళుతున్నట్లు పాతపట్నం నియోజకవర్గం లోని చంపాపురానికి చెందిన లక్ష్మీ చారిటబుల్ ట్రస్టు అద్యక్షుడు టి.ప్రసాదరావు తెలియజేసారు.వంశధార ప్రాజెక్ట్ విషయంలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు రైతులకు జరుగుతున్న నష్టంపై పవన్ కళ్యాణ్ కు లేఖ రాసినట్లు తెలిపారు.. కొద్దిరోజుల్లో ఆయనను స్వయంగా కలిసి ఈ సమస్యకు సంబందించిన సమగ్ర నివేదికను అందించనున్నట్లు తెలిపారు..ఈ సమావేశం లో జిల్ల జనసేన కార్యకర్తలు డీ.లక్ష్మణ్ రావు,సీహెచ్.శివప్రసాద్,పి.ఎస్.మణి,ఆర్.భాను,పి.లింగం నాయుడు,పి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు..


Learn more »
http://go.ad2up.com/afu.php?id=968302